అనురాగ్ లో ఏడబ్ల్యుఎస్ ఈసీ-2పై ఏఐఎంఎల్ విద్యార్థులకు హ్యాండ్స్-ఆన్ శిక్షణ

28-09-2026 | 09:38pm

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ(Anurag University)లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్(Artificial Intelligence and Machine Learning) విభాగం ఆధ్వర్యంలోని థింక్ క్లౌడ్ క్లబ్, ఏ డబ్ల్యూ ఎస్ అకాడమీ సహకారంతో “ఏడబ్ల్యుఎస్ ఈసీ 2(AWS EC-2)” అంశంపై ఒకరోజు హ్యాండ్స్-ఆన్ శిక్షణ కార్యక్రమాన్ని  నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 130 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఏఐఎంఎల్ విభాగాధిపతి డాక్టర్  ఎ. మల్లికార్జున రెడ్డి ప్రారంభించి సాంకేతిక రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను వివరించారు. ఆధునిక కంప్యూటింగ్ అవసరాలు, అభివృద్ధి చెందుతున్న ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా విద్యార్థులు క్లౌడ్ టెక్నాలజీలలో ప్రాయోగిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు