కాంగ్రెసోళ్లు నమ్మినోళ్లనూ ముంచేస్తారు

02-10-2026 | 05:00am
  1. కళాకారుల కన్నీళ్లు మంచిది కాదు
  2. వారికి ఉద్యోగాలెప్పుడిస్తారు?
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): నమ్మినోళ్లను నట్టేట ముంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మించినోళ్లు లేరని మాజీ మంత్రి హరీష్‌రావు(Former Minister Harish Rao) విమర్శించారు. గురువారం ట్విట్టర్ వేదికగా హరీష్‌రావు స్పందిస్తూ.. కళాకారులను కూడా దగా చేసిన దుర్మార్గపు ప్రభుత్వం ఇది అని విమర్శించారు. అధికారంలోకి రావడానికి 1000 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, మూడేళ్లు గడిచినా ఆ హామీ అమలు కాలేదని మండిపడ్డారు.

కడుపు మండిన కళాకారులు నిలదీస్తే.. సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్నాళ్లు ఇలా తప్పించుకు తిరుగుతారు?, డైవర్షన్ రాజకీయాలు.. ఊక దంపుడు డైలాగులతో ఇంకెన్నాళ్లు ప్రజలను మభ్యపెడతారు రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. కళాకారుల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. కళాకారుల జీవితాలతో చెలగాటమాడటం మాని.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. 


మరిన్ని వార్తలు