స్కాష్‌లో హ్యాట్రిక్ మెడల్స్
- అదరగొట్టిన భారత ప్లేయర్స్
- మహిళల, పురుషుల సింగిల్స్‌లో రజతాలు
- మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్యం
నగోయా, సెప్టెంబర్ 27: ఆసియా క్రీడల్లో భారత స్కాష్ అథ్లెట్లు(Indian squash athletes) మొత్తం 3 పతకాలను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. భారత్‌కు రెండు రజతాలు, ఒక కాంస్య పతకం దక్కాయి. ఆసియా క్రీడల స్కాష్ సింగిల్‌సలో ఫైనల్ చేరి రజతం గెలిచిన తొలి భారతీయ మహిళగా 18 ఏళ్ల అనాహత్ చరిత్ర సృష్టించింది. ఫైనల్లో మలేషియాకు చెందిన శివసంగరి సుబ్రమణియం చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఇప్పటివరకు భారత స్కాష్ దిగ్గజాలు దీపికా పల్లికల్, జోష్న చిన్నప్ప కూడా మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకాలతోనే సరిపెట్టుకున్నారు.
అయితే 18 ఏళ్ల అనాహత్ వారి రికార్డును అధిగమించింది. వరల్డ్ జూనియర్ స్కాష్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన అనాహత్ సింగ్, ఇప్పుడు సీనియర్ విభాగంలోనూ ఆసియా క్రీడల రజతంతో అదరగొట్టింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో అభయ్ సింగ్ కూడా రజతం సాధించాడు. ఫైనల్లో మలేసియా ఆటగాడు ఎన్‌గ్ ఈన్ యో చేతిలో 0-3తో ఓడిపోయాడు. 9- 5 5 వరుస గేముల్లో పరాజయం చవిచూశాడు. అయితే ఆసియా క్రీడల పురుషుల సింగిల్సలో ఫైనల్‌కు చేరిన రెండో భారతీయ స్కాష్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
గతంలో ఈ ఘనతను సౌరభ్ ఘోషల్ సాధించాడు. అంతేకాదు.. ఈ ఆసియా క్రీడలు భారత్ స్కాష్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోనున్నాయి. ఒకే ఎడిషన్‌లో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల రెండింటిలోనూ భారత అథ్లెట్లు సిల్వర్ సాధించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే మికస్డ్ డబుల్స్‌లో జోష్న చిన్నప్ప, వేలవన్ సెంథిల్ కుమార్ కాంస్యం సాధించారు. సెమీఫైనల్లో హాంకాంగ్ జోడీ చేతిలో ఓడిపోయిన భారత ద్వయం కాంస్యం గెలిచింది. ఈ పతకంతో 40ఏళ్ల జోష్న చిన్నప్ప ఆసియా క్రీడల్లో తన 6వ పతకాన్ని సాధించి రికార్డు సృష్టించింది.