వెంటాడుతున్న గాయాలు
టీమిండియా క్రికెటర్లను గాయాలు వెంటాడుతున్నాయి. ఏ ఆటగాడికైనా గాయాలు సహజమే కానీ గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ సాధించే విషయంలో మాత్రం గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. టీమిండియాలో ఇంజ్యూరీ మేనేజ్ మెంట్ సరిగ్గా లేదన్న వాదన వినిపిస్తోంది. బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ తరచుగా గాయాల బారిన పడడంతో టీమ్ ఫిజియో, డాక్టర్ పై బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉంది. కెప్టెన్ గిల్, కోచ్ గంభీర్ సైతం కాంబినేషన్స్ కుదరక తల పట్టుకుంటున్నారు.
- ఫిట్‌గా లేకున్నా ఆడిస్తున్నారా ?
- గాయాల బారిన కీలక ఆటగాళ్లు
- టీమ్ ఫిజియో, డాక్టర్‌పై బీసీసీఐ అసంతృప్తి
- గంభీర్, గిల్ సైతం అసహనం
ముంబై, ఆగస్టు 3 : ప్రపంచ క్రికెట్ లోనే బీసీసీఐ అత్యంత ధనిక బోర్డు. ఆటగాళ్ల గా యాలకు ట్రీట్ మెంట్, రిహాబిలిటేషన్ కో సం ప్రత్యేకం అతిపెద్ద సెంటర్ ఆఫ్ ఎక్స్ లె న్స్ సైతం సొంతంగానే ఏర్పాటు చేసుకుంది. గాయంతో బెంగళూరు సీవోఈకి వెళితే పూ ర్తిగా కోలుకుని, ఫిట్‌నెస్ సాధించి మళ్లీ జ ట్టులోకి తిరిగి రావొచ్చు. అలాంటి మౌలిక సౌకర్యాలు అక్కడ ఉన్నాయి. కానీ సమన్వ య లోపమో, మరో కారణమో తెలీదు కానీ మన క్రికెటర్లు తరచుగా గాయాల బారిన పడుతున్నారు.
పూర్తిగా కోలుకోకుండానే ఆ డిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బుమ్రా వరుస గాయాలే దీనికి ఉదాహరణ. బుమ్రా లాంటి స్టార్ పేసర్ విషయంలో ప్ర తీసారీ ఇది రిపీట్ అవుతోంది. తాజాగా లం కతో సిరీస్‌కు ఫిట్‌గా ఉన్నాడంటూ వార్తలు వచ్చిన మూడు రోజులకే మళ్లీ గాయం తిరగబెట్టిందన్న విషయం వెలుగులోకొచ్చింది. దీంతో లంకతో టెస్ట్ సిరీస్‌కు సైతం ఈ స్టార్ పేసర్ దూరమయ్యాడు. బుమ్రా ఒక్కడే కా దు మరికొందరు స్టార్ ఆటగాళ్లు సైతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
నితీష్‌కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆ డలేదు. యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ ఇటీవ లే గాయపడ్డాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటన తర్వాత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ప్లేయర్ల గాయాలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఆటగాళ్ల ఫిట్నెస్, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ విషయంలో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, జట్టు యాజ మాన్యం, సపోర్ట్ స్టాఫ్ మధ్య సరైన సమన్వయం లేకపోవడమే దీనికి కారణమని భా విస్తున్నారు. ఆటగాళ్లు తరుచూ గాయాలతో దూరమవుతుండటంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తతో పాటు కెప్టెన్ శుభ్మన్ గిల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
ఫిజి యో బృందంపై బీసీసీఐ ఆగ్రహంగా ఉన్న ట్లు సమాచారం. ఆటగాళ్ల ఇంజ్యూరీ మేనేజ్మెంట్ సరిగ్గా లేదని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలంక పర్యటన తర్వాత హె డ్ ఫిజియోథెరపిస్ట్ కమలేశ్ జైన్, టీమ్ డా క్టర్ రిజ్వాన్ ఖాన్లపై వేటు వేసే అవకాశాలున్నాయి. పలువురు ఆటగాళ్లను పూర్తిగా ఫి ట్‌గా లేకున్నా తొందరపడి ఆడించేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టీ 20 ప్రపం చ కప్నకు ముందు వాషింగ్టన్ సుందర్‌ను కూడా పూర్తిస్థాయి ఫిట్నెస్ లే కుండానే జట్టులోకి తీసుకొ చ్చినట్లు సమాచారం.
నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా విషయంలోనూ ఇదే జరిగినట్టు బోర్డు అధికారి ఒ కరు తెలిపారు. పూర్తి ఫిట్‌నెస్ సాధించకుండా మైదా నంలోకి దింపొద్దని , ఇలాంటి తప్పిదాలు జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో ఆడే ప్లేయర్లు చాలా తక్కువగా ఉన్నందున అంతర్జాతీయ సిరీస్ల మధ్య వారికి విరామం లభిస్తోంది. అయితే పునరావాసం కోసం సీ వోఈలో లేకపోతే ఆటగాళ్లు త మంతట తా మే ఫిట్నెస్ చూసుకోవాల్సిన ప రిస్థితి ఏర్పడుతోంది. బీసీసీఐ, టీమ్ మేనేజ్ మెంట్ ఈ అంశంపై దృష్టిసారించాల్సి ఉంటుంది.






