4 August, 2026 | 2:48 AM

అభిషేక్ శర్మకు నో ఛాన్స్

04-08-2026 01:16 AM

దులీప్ ట్రోఫీకి నార్త్ జోన్ జట్టు ప్రకటన 

ముంబై, ఆగస్టు 3 : పేలవ ఫామ్ లో ఉన్న టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు నార్త్ జోన్ సెలెక్టర్లు షాకిచ్చా రు.దులీప్ ట్రోఫీ 2026 కోసం 15 మంది సభ్యుల నార్త్ జోన్ జట్టులో అభిషేక్ ను పక్కన పెట్టారు. ఈ జట్టుకు కెప్టెన్గా ఎవరూ ఊహించిన ఆటగాడికి అవకాశం లభించిం ది. జమ్మూ కశ్మీర్కు చెందిన వికెట్ కీపర్ బ్యా టర్ కన్హయ్య వాధ్వాన్కు సెలెక్టర్లు కెప్టెన్సీ ప గ్గాలు అప్పజెప్పారు. అతడికి డిప్యూటీగా ఢిల్లీకి చెందిన ఆయుష్ బదోనీని ఎంపిక చేశారు.

జమ్మూ కశ్మీర్ రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్ సాధించడంలో వా ధ్వాన్ కీలక పాత్ర పోషించాడు. 13 ఇన్నింగ్స్‌లో 474 పరుగులు, 36.56 సగటుతో రాణించాడు. ఇందులో ఒక సెం చరీ కూడా ఉంది. రంజీ ట్రో ఫీ ఫైనల్లోనూ హాఫ్ సెం చరీ సాధించాడు. ఈ జట్టులో అత్యధికంగా రంజీ ఛాంపియన్ జమ్మూ కశ్మీర్ ఆటగా ళ్లకు చోటు లభించింది. టీమిండియా ఆటగాళ్లు అర్ష్దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉన్నందున శుభ్మన్ గిల్, ఆకిబ్ నబీని ఎంపిక చేయలేదు. దు లీప్ ట్రోఫీ ఆగస్టు 23న ప్రా రంభం కానుండగా.. అదే రోజు నార్త్ జోన్-వెస్ట్ జోన్ మ్యాచ్ ప్రారంభం కా నుంది.

నార్త్ జోన్ జట్టు 

సనత్ సంగ్వాన్, క్వామ్రాన్ ఇక్బాల్, యశ్ ధుల్, ఆయుష్ దోసేజా, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోనీ (వైస్ కెప్టెన్), కన్హయ్య వాధ్వాన్ (కెప్టెన్), నిశాంత్ సింధు, అర్జున్ శర్మ, అబిద్ ముస్తాక్, అర్ష్దీప్ సింగ్, సునీల్ కుమార్, అన్షుల్ కాంబోజ్, యుధ్వీ ర్ సింగ్, నిఖిల్ కశ్యప్.