7 April, 2026 | 5:10 PM

Breaking News

ఎమ్మెల్యే విజయ రమణారావుకు నిలువెత్తు దండతో ఘనంగా సన్మానం   •   చంద్ర మహంకాళి ఆలయంలో పూజలు   •   గోపాల్పేట్ శ్రీ నల్లపోచమ్మ నూతన ఆలయ కమిటీ ఎన్నిక   •   పేదల స్వంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం: ధరావత్ వీరన్న నాయక్   •   'టచ్ చేసి చూడు.. పాకిస్థాన్‌ ముక్కలే'! పాక్‌కు భారత్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌   •   గిరిజన గ్రామంలో పోలీసుల గ్రామోత్సవం నిర్వహణ   •   రసాయనాల నియంత్రణతో క్యాన్సర్ నివారణ   •   ఘనంగా జీవీఆర్ జన్మదిన వేడుకలు   •   పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్   •   ఐఎన్టీయుసీ కాంట్రాక్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎస్కే బాజీ సాహెబ్   •  

హయత్‌నగర్ తట్టి అన్నారం రోడ్డును పునరుద్ధరించాలి

12-02-2026 01:16 AM
  1. అక్రమ నిర్మాణాలతో రోడ్డు మూసివేత, రాకపోకలకు ఇక్కట్లు 
  2. హైడ్రాకు ఫిర్యాదు చేసిన వివిధ కాలనీవాసులు 
  3. హైడ్రా సర్వేను అడ్డుకున్న అక్రమదారులు

ఎల్బీనగర్, ఫిబ్రవరి 11 : విజయవాడ జాతీయ రహదారి అనుకుని హయత్ నగర్ నుంచి 50 ఫీట్ల వెడల్పుతో ఉన్న తట్టి అన్నారం రోడ్డును అక్రమ నిర్మాణాలతో మూసి వేశారు. ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న రోడ్డును ఆక్రమించడంతో సుమారు 50 కాలనీల ప్రజలు తమ ఇండ్లకు చేరుకోవడానికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. హయత్ నగర్ - తట్టి అన్నారం రోడ్డును అక్రమ నిర్మాణాలతో ఆక్రమించి రాకపోకలకు అడ్డుకు న్నారని వివిధ కాలనీ సంఘాల నాయకుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు స్పందించారు.

ప్రజల ఫిర్యాదుతోపాటు తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బుధవారం హైడ్రా ఏసీపీ ఉమామహేశ్వర్ రావు, సీఐ సైదులు రోడ్డును సర్వే చేయడానికి తమ సిబ్బందితో వచ్చారు. హైడ్రా అధికారులు సర్వే చేస్తున్నారని తెలుసుకున్న నిర్మాణదారులు సర్వేను అడ్డుకుని అధికారులు, స్థాని కులతో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళ్తే... హయత్ నగర్ మండల కార్యాలయం పక్క నుంచి జాతీయ రహదారి నుంచి 50 ఫీట్ల వెడల్పుతో తట్టి అన్నారం వరకు రోడ్డు ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నది. హయత్ నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 16లో 18 గుంటల భూమిని ప్రభుత్వం కొంత మంది నిరుపేదలకు ఇచ్చింది.

అయితే, భూమిని పొందిన వారు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో కాకుండా 50 ఫీట్ల తట్టి అన్నారం రోడ్డును ఆక్రమించి ఇండ్లు నిర్మించుకున్నారు. రోడ్డు ను ఆక్రమించి ఇండ్ల నిర్మాణం చేపట్టడంతో సుమారు 50 కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వివిధ కాలనీల ప్రజలకు నిర్మాణాదారులతో చాలా ఏండ్లుగా వివా దం కొనసాగుతుంది. చివరికి ఆయా కాలనీల ప్రజలు కలిసి హయత్ నగర్ - తట్టి అన్నారం రోడ్డు పునరుద్ధరణ సాధన సమితిగా ఏర్పడి రోడ్డు కోసం పోరాడుతున్నారు. దీంతో రోడ్డును పునరుద్ధరిం చాలని హైడ్రా, తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు.

ప్రజల ఫిర్యాదుతో హయత్ నగర్ తహసీల్దార్ స్పందించి రికార్డులను పరిశీలించి, సర్వే నంబర్ 16లో హయత్ నగర్ నుంచి తట్టి అన్నారం వరకు 50 ఫీట్ల వెడల్పుతో రోడ్డు ఉందని, కొందరు రోడ్డును ఆక్రమించి మూసి వేశారని హైడ్రా అధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ సందర్భంగా హైడ్రా అధికారులు మాట్లాడుతూ.. త్వరలోనే ఇరువర్గా లతో సమావేశం ఏర్పాటు చేసి, అభిప్రాయ సేకరణ చేస్తామన్నారు. ప్రభుత్వ రికార్డులు పరిశీలించి, రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా రోడ్డు విషయంపై చర్చిస్తామని తెలిపారు. హయత్ నగర్ - తట్టి అన్నారం రోడ్డును పునరుద్ధరించాలని హయత్ నగర్ - తట్టి అన్నారం రోడ్డు పునరుద్ధరణ సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు.