8 July, 2026 | 5:05 PM

Breaking News

ఎస్‌ఐఆర్ నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో మురళి   •   పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •   సీపీఎస్ రద్దుకై త్వరలో ఆమరణ దీక్ష   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మునిగేలా రాజు   •   నాచారంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకులు   •   వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. కొట్టుకున్న కార్యకర్తలు   •  

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికరలాభం రూ.16,821 కోట్లు

20-10-2024 12:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికరలాభం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో స్వల్పంగా 5 శాతం వృద్ధిచెంది రూ. 16,821 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో బ్యాంక్ రూ. 15,976 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2024 జూలై౬ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.78,406 కోట్ల నుంచి రూ.85,500 కోట్లకు పెరిగినట్లు శనివారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది.

క్యూ2లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ. 27,390 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ. 30,110 కోట్లకు పెరిగింది. అయితే బ్యాంక్ ఆస్తుల నాణ్యత స్వల్పంగా క్షీణించింది. స్థూల ఎన్‌పీఏలు 1.34 శాతం నుంచి 1.36 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.35 శాతం నుంచి 0.41 శాతానికి పెరిగాయి.