10 May, 2026 | 12:53 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

డ్రైనేజీలో పడి శవమై తేలాడు

08-08-2024 03:40 AM

భద్రాచలం, ఆగస్టు 7: భద్రాచలం పట్టణం చర్ల రోడ్డులో గల ప్రధాన డ్రైనేజీ కాలువలో గళ్లంతన ఓ వ్యక్తి శవమై తేలాడు. చత్తీస్‌ఘడ్ రాష్ట్రం పామెడుకు చెందిన సున్నం సతీష్, అతని భార్య సునీత కొన్నేళ్లుగా భద్రాచలంలో రోడ్డు వెంట ప్లాస్టిక్ సామాన్లు ఏరుకొని జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం చర్ల రోడ్డులోని కేకే ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న డ్రైనేజీలో ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకొంటున్న క్రమంలో సతీష్ కాలుజారి అందులోనే పడి గల్లంతయ్యాడు. పక్కనే ఉన్న భార్య సునీత, స్థానికులు అతడిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ డ్రైనేజీ 8 అడుగల లోతు ఉండటంతో కుదరలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో..  గ్రామపంచాయతీ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది అక్కడకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు శవాన్ని వెలికితీశారు. భధ్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పంచాయతీ ఈఓ శ్రీనివాసరావు దగ్గర ఉండి వెలికితీసే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.