8 July, 2026 | 1:20 PM

దళిత క్రైస్తవ మహా గర్జనకు మందకృష్ణ మాదిగ రాక

08-07-2026 12:48 PM

మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరణకై ఈనెల 17న జిల్లా కేంద్రంలోజేజేఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న దళిత క్రైస్తవ మహా గర్జనకు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) వస్తున్నట్లు దళిత క్రైస్తవ జేఏసీ కన్వీనర్ కాశపోగు ప్రసాద్ తెలిపారు. బుధవారం హైదరాబాదులోని ఆయన నివాసంలో మందకృష్ణ మాదిగను కలిసి ఆహ్వానించగా ముందుండి నాయకత్వం వహిస్తానని భరోసా ఇచ్చారని నేతలు వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ గత కొన్నాళ్లుగా దళిత క్రైస్తవులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ జీవనాన్ని సాగిస్తున్నమన్నారు ఇక ఆదుకోవాల్సిన ప్రభుత్వాలైతే మమ్మల్ని ఓట్ బ్యాంక్ గా వాడుకొని తర్వాత మాపై కక్షసాధింపులకు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం దళిత క్రైస్తవులపై దాడులతో పాటు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొంటూ వాటిని అదిగమిచేందుకే దళిత క్రైస్తవుల్ని ఏకతాటిపైకి తీసుకొస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దళిత క్రైస్తవులు అత్యధికంగా ఉన్నారని నిరూపించేందుకే తాము ఈ దళిత గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమాన్ని   ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 5వేల దళిత క్రైస్తవులతో మహాగర్జన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి మందకృష్ణ మాదిగ నాయకత్వం వహించి మా పక్షాన పోరాటం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు దళితుల పట్ల జరుగుతున్న అన్యాయంతోపాటు సమస్యలని రాజ్యాంగబద్ధంగా పరిష్కరించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు.ఉమ్మడి జిల్లాలోని దళిత క్రైస్తవులంతా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నేతలు యేసు, ప్రభాకర్, యోనా, మిట్టు తదితరులు పాల్గొన్నారు.