మంత్రుల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు అరెస్ట్.!
08-07-2026 12:29 PM
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao), రాష్ట్ర రోడ్డు రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం నాగర్ కర్నూల్ పర్యటన నేపథ్యంలో స్థానిక బిఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. బస్ డిపో వద్ద నూతన బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు హాజరవుతున్న క్రమంలో అదే ప్రాంతంలో అడ్డుకునేందుకు బిఆర్ఎస్ నేతలు నిర్ణయించుకున్నట్లు పోలీసులు పసిగట్టారు. బస్ డిపో పరిసరాల్లో సంచరిస్తున్న కొంత మందిని అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. తిమ్మాజిపేట మండల కేంద్రంలోనూ మరి కొంత మంది మంత్రి పర్యటనను అడ్డుకోబోతున్నట్లు గుర్తించి బిఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.






