బోథ్‌లో భారీ వర్షం
21-09-2026 | 12:10pm
బోథ్. సెప్టెంబర్ (విజయ క్రాంతి): మండలంలో సోమవారం ఉదయం దాదాపు 20 నిమిషాల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు హర్షం(Farmers rejoice) వ్యక్తపరుస్తున్నారు. వర్షం పంటలకు ప్రాణం పోసిందని అంటున్నారు. సరి అయిన వర్షాలు లేక పంటలు ఎదగలేకపోతున్నాయి. పత్తి పంట ప్రస్తుతం పూత, ఖాతా దశలో ఉండడంవల్ల వర్షం అత్యవసరమైన రైతులు పేర్కొంటున్నారు. వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరట ఇచ్చింది.