22 July, 2026 | 6:00 PM

Breaking News

జన్నారంలో దంచికొట్టిన వర్షాలు

22-07-2026 04:58 PM

- ఉక్కపోత నుంచి ప్రజలకు ఊరట!

జన్నారం,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న ఆకస్మిక వర్షాలతో స్థానిక ప్రజలు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. ఇరవై రోజులుగా ఎండ తీవ్రతతో, తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోయిన జన్నారం వాసులకు ఈ వర్షాలు ఎంతో ఉపశమనాన్ని కలిగించాయి. వర్షాల కారణంగా మండలంలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. ఏదేమైనప్పటికీ, ఈ వర్షాలు వేసవి తాపాన్ని పూర్తిగా తగ్గించడంతో పాటు, రాబోయే వ్యవసాయ పనులకు రైతాంగం సన్నద్ధం కావడానికి ఎంతో దోహదపడతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.