22 July, 2026 | 6:24 PM

Breaking News

గిరిజన ఆశ్రమ పాఠశాలల సమస్యలు వెంటనే పరిష్కరించాలి   •   ఫుడ్ గ్రీన్ స్టోరేజ్ భవనంకు శంకుస్థాపన   •   మూడు రోజుల ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్య శిక్షణ విజయవంతంగా ముగింపు   •   కుమ్రం భీం భావితరాలకు స్ఫూర్తిదాయకం: డిటిడిఓ జాదవ్ అంబాజీ   •   ఘనంగా దశరథి కృషణమాచార్య జయంతి   •   విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులే చైతన్యం కల్పించాలి   •   ఉపాధ్యాయులకు ముగిసిన శిక్షణ   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించిన పర్యాటక శాఖ అధికారులు   •   యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి   •   వారాహి మాత మాలధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ   •  

వారాహి మాత మాలధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ

22-07-2026 05:53 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక విజయ దుర్గ ఆలయంలో కొలువై ఉన్న శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో వారాహి మాత మాలధారణ స్వాములకు నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్  కొణతం చిన్న వెంకటరెడ్డి, నాలుగో వార్డ్ కౌన్సిలర్ కొనతం మంజుల దంపతుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ కొనతం చిన్న వెంకటరెడ్డి మాట్లాడుతూ... వారాహి అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వారాహి అమ్మవారి మాలదారులకు అన్నదాన కార్యక్రమం చేయడం ఎంతో పుణ్య కార్యక్రమముని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వారాహి మాత మాలధారుల స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు.