13 July, 2026 | 5:23 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

SIR ఫారాలపై నేరేడుచర్లలో హెల్ప్ డెస్క్

13-07-2026 04:08 PM

14 వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో 5 రోజులుగా సేవలు.

నేరేడుచర్ల,జూలై13(విజయ క్రాంతి ): ఓటర్ జాబితా సవరణ "సర్ " ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నేరేడుచర్ల 14వ వార్డు కౌన్సిలర్ సరికొప్పుల విజయలక్ష్మి, నాగేశ్వరావు ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.గత 5 రోజులుగా నిర్వహిస్తున్న ఈ హెల్ప్ డెస్క్ లో" సర్" ఫారాలు నింపడంపై అవగాహన లేని వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఫారాలు అందని వారికి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి అందిస్తున్నారు.

అదేవిధంగా పాత ఓటర్ లిస్ట్‌లో పేర్లు వెతికేందుకు సహాయం చేస్తున్నారు.ఈ కార్యక్రమం ద్వారా 14వ వార్డు ప్రజలతో పాటు నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని వారికి కూడా సహాయం అందిస్తున్నారు. స్థానికులు, పెద్దలు ఈ చొరవను హర్షిస్తూ అభినందించారు.ఎమ్మార్వో సైదులు గౌడ సూచనల మేరకు స్థానిక బి ఎల్ వో లు తులసి, రజిత ఆర్పీ లు చంద్రకళ, విజయ నిర్మలతో కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ హుజూర్‌నగర్ ఇంచార్జ్ సరికొప్పుల నాగేశ్వరరావు కొమ్మరాజు శ్రీను, సాయి చరణ్ తో పాటు స్థానికులు పాల్గొన్నారు.