25 May, 2026 | 1:06 AM

పురుష:ను ఆదరిస్తున్నారు

25-05-2026 12:00 AM

థాంక్యూ మీట్‌లో హీరో పవన్ కళ్యాణ్ బత్తుల

ఈ నెల 22న విడుదలైన పురుష: సిని మాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని హోరో పవన్‌కళ్యాణ్ బత్తుల అన్నారు. శనివారం చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ‘నేను సత్యా నంద్ మాస్టర్ గారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. ఈ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పలేదు.

ఈ రోజు నా నటనకు మంచి పేరు వస్తోంది. అందుకే ఈ రోజు నేను సత్యానంద్ మాస్టర్ గారి శిష్యుడిని అని గర్వంగా చెప్పుకుంటున్నాను. మూవీని చూ సిన ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు. నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘పురుష: సినిమాను ఇంతటి స్థాయికి తీసుకు వెళ్లిన మీడియాకి థాంక్స్. ముగ్గురు హీరోయిన్లు చక్కగా నటించారు. మా అబ్బాయి యాక్టింగ్ నాకు నచ్చింది. ఎక్కడా కొత్త అబ్బాయిలా అనిపించలేదు’ అన్నారు.

దర్శకుడు వీరు వులవల మా ట్లాడుతూ.. ‘పురుష: చిత్రాన్ని ఇంతలా సపో ర్ట్ చేస్తున్న మీడియాకి థాంక్స్. మా ఆర్టి స్టులు, మా టీం కలిసి ఎంతో కష్టపడి ఈ మూవీని తీశాం. మా మూవీని ఆడియెన్స్ వరకు రీ చేసిన మీడియాకి థాంక్స్. సిని మాని ఆదరిస్తున్న ఆడియెన్స్కి థాంక్స్’ అని అన్నారు. కసిరెడ్డి రాజ్ కుమార్ మాట్లాడు తూ.. ‘పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి. నటనలో సక్సెస్ అయ్యాడు. నాకు ఆనం దంగా ఉంది. రాయంచ అద్భుతంగా నటిం చారు. హాసిని, విషిక అందరూ చక్కగా నటించారు. సప్తగిరి అన్నతో నటించడం ఆనందంగా ఉంది’ అన్నారు. రాయంచ మా ట్లాడుతూ.. “పురుష:’ మూవీని మీడియా ముందుండి సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇది నాకు తొలి చిత్రం.

ఇంత పాజిటివ్ వైబ్స్ చూస్తుండటం ఆనందంగా ఉంది. దీనం తటికి మా దర్శక, నిర్మాతలే కారణం’ అన్నా రు. విషిక మాట్లాడుతూ.. ‘మహిళా ప్రేక్షకు లు ‘పురుష:’ మూవీని చూసి ఎక్కువగా ప్ర శంసలు కురిపిస్తున్నారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన వీరు గారికి థాంక్స్’ అని అన్నారు. హాసిని సుధీర్ మాట్లాడుతూ.. ‘పురుష: మూవీని మీడియా చాలా బాగా ప్రమోట్ చేసింది. మా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందరం కష్టపడి ఈ చిత్రా న్ని చేశాం’ అన్నారు. నటి సంధ్య మాట్లాడు తూ.. ‘పురుష:లో నా పాత్రకు మంచి రెస్పా న్స్ వస్తోంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు. కార్యక్రమంలో కెమెరామెన్ సతీష్, ఆర్ట్ డైరెక్టర్ రవి మాట్లాడారు.