25 May, 2026 | 1:05 AM

19 ఏళ్ల తర్వాత జీవాతో..!

25-05-2026 12:00 AM

హీరోయిన్ అంజలి తన నటనతో, హోమ్లీ లుక్స్ తో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ బ్యూటీ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. గత ఏడాది విడుదలైన మదగజరాజా చిత్రంతో విజయాన్ని అం దుకున్న అంజలి, తాజాగా ఒక బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. అంజలి తన కెరీర్ ఆరంభంలో జతకట్టిన హీరో సరసన మరోసారి రొమాన్స్ చేయబోతోంది. కోలీవుడ్ హీరో జీవా, అంజలి కాంబినేషన్‌లో 2007లో తమిళ చిత్రం ‘కత్రదు తమిజ్’ వచ్చింది. ఈ సినిమా తెలుగులో ‘కళాశాల రఘురామ్’ పేరుతో విడుదలై, విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఆ సినిమాలో వీరిద్దరి నటనకు, కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

దాదాపు 19 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ హిట్ పెయిర్ మళ్లీ ఇప్పుడు స్క్రీన్ పంచుకోనున్నారట. ఇది అధికారిక ప్రకటనేమీ కాకపోయినప్పటికీ ఈ వార్త.. అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తోంది. లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు.. వైవిధ్య చిత్రాల దర్శకుడు వసం త బాలన్ దర్శకత్వం వహించనున్నారని టాక్. ఈ సినిమాను కన్నన్ రవి గ్రూప్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్టు సమాచారం.