కేసీఆర్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్: హైకోర్టులో విద్యుత్ విచారణ కమిషన్ పై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) వేసిన పిటిషన్ విచారణ గురువారం జరిగింది. విద్యుత్ విచారణ కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ వేశారు. విద్యుత్ కమిషన్ తీరు నిబంధనలకు విరుద్ధం అని కేసీఆర్ న్యాయవాది తెలిపారు. జస్టిస్ నరసింహరెడ్డి ఏకపక్షంగా ప్రెస్ మీట్ పెట్టారన్నారు. ప్రెస్ మీట్ నిర్వహణ సుప్రీం కోర్టు తీర్పులకు విదర్ధమని పేర్కొన్నారు. నోటీసులకు జవాబివ్వకముందే ప్రెస్ మీట్ పెట్టారని వెల్లడించారు. ఈఆర్ సీ నిర్ణయం మేరకే విద్యుత్ కొనుగోళ్లు చేశామని న్యాయవాది స్పష్టం చేశారు. విద్యుత్ నియంత్రణ కమిషన్ న్యాయబద్ధ సంస్థ అన్నారు. ఈఆర్ సీ నిర్ణయాలపై విచారణ కమిషన్ వేయకూడదని కేసీఆర్ తరుఫు న్యాయవాది తెలిపారు. కమిషన్ తీరు ఏకపక్షం, నిబంధనలకు విరుద్ధం అన్నారు. కేసీఆర్ వేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.






