25 July, 2026 | 3:46 PM

ఆషాడం బోనాల జాతరపై మంత్రి పొన్నం సమీక్ష

27-06-2024 01:32 PM

హైదరాబాద్: ఆషాడ మాసం బోనాల సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ ఇంచార్జి పొన్నం ప్రభాకర్ గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ బోనాల జాతరపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రజలంతా సహకరిస్తేనే పండుగ విజయవంతం అవుతోందన్నారు. బోనాల జాతరలో వృద్ధుల కోసం ప్రత్యేక ఎలక్ట్రిక్ వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ భేటీలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.