5 May, 2026 | 1:47 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్.. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు

18-10-2024 04:55 PM

హైదరాబాద్: గ్రూప్-1 పరీక్షపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో గ్రూప్-1 మెయిన్స్ కు లైన్ క్లియర్ అయింది. షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. ప్రాథమిక కీలో తప్పులున్నాయనే పిటిషన్ పై డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. 

ఇప్పటికే  గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రూప్ 1 అభ్యర్థుల తరపున  అడ్వకేట్ మోహిత్‌రావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని చీఫ్ జస్టిస్ కోర్టులో స్పెషల్ మోషన్ వేశారు.  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ గ్రూప్ 1 కేసు పిటిషన్‌ను సోమవారం విచరాణ చేపడుతామని తెలిపారు.