15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఉద్యమకారుల హామీల అమలుపై హైకోర్టు మార్గదర్శకాలు హర్షణీయం

25-02-2026 01:11 AM

మొయినాబాద్ ఫిబ్రవరి 24(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై హైకోర్టు ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇవ్వడం స్వాగతించదగిన విషయమని తెలంగాణ ఉద్యమకారుల పోరాట జిల్లా అధ్యక్షుడు కుమ్మరి రమేష్ అన్నారు. మొయినాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమకారుల హామీల అమలు విషయంలో హైకోర్టు స్పందించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన, ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం, గుర్తింపు కార్డులు, పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు.ఈ సందర్భంగా ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల పోరాట మండల అధ్యక్షుడు న్యాలపల్లి మహిపాల్, నాయకులు అనిల్, ముకుందరెడ్డి, యాదయ్య, నవీన్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.