3 July, 2026 | 8:03 PM

హిందీ జాతీయ భాష కాదు..

11-01-2025 01:36 AM

దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

చెన్నై, జనవరి 10: హిందీ భాష జాతీ య భాష కాదని, అధికారిక భాష మాత్రమేనని ఇటీవలే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించారు. చెన్నై లోని  ఓ కాలేజ్  స్నాతకోత్సవానికి  ము ఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ.. హిందీ అధికార భాష మాత్రమే అని, జాతీయ భాష కాదని అ భిప్రాయపడ్డారు. హిందీపై అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లువిమర్శలు గుప్పిస్తున్నారు. అశ్విన్ లాంటి వ్యక్తి ఇలా మా ట్లాడటం సరికాదంటున్నారు.