3 July, 2026 | 7:17 PM

ఓటరు నమోదులో ప్రజలంతా భాగస్వాములు అవ్వాలి

03-07-2026 06:36 PM

జవహర్ నగర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండలు ముదిరాజ్

జవహర్ నగర్,(విజయక్రాంతి): ఓటర్ నమోదులో ప్రజలంతా భాగస్వాములు అవ్వాలని పారదర్శకతతో కూడిన జాబితా యే లక్ష్యంగా బిఆర్ఎస్ నాయకులు పనిచేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండలు ముదిరాజ్ అన్నారు .ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల ముదిరాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం జవహర్ నగర్ లో పలు బూత్ లను పార్టీ కార్యకర్తలుతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా కొండలు ముదిరాజ్ మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియ ప్రభుత్వ అధికారులతో సవ్యంగా జరుగుతుందని జవహర్ నగర్ లోని ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరు నమోదు ప్రక్రియలో తమ పేరును నమోదు చేసుకొని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలు తమ ఓటు హక్కును నమోదు చేసుకొని దేశ ఔన్నత్యాన్ని కాపాడాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని ఆ వజ్రాయుధాన్ని ప్రజలు సక్రమంగా వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం పది కాలాల పాటు పరిఢమిల్లుతుందని తెలిపారు.