3 July, 2026 | 7:37 PM

వరద నివారణ చర్యలు

03-07-2026 06:52 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో వర్షాలు కురిసి వరదలు వస్తే ప్రజలకు ఇబ్బంది కాకుండా నివారణ చర్యలు చేపట్టినట్టు మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య గణేష చక్రవర్తి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని శివాజీ చౌక్లో మురికి కాలువలో ఉన్న చెత్త చెదారం పిచ్చి మొక్కలను తొలగించారు. మురికి కాలువలు ప్రజలు చెత్త వేయవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిబాబు సిబ్బంది ఉన్నారు.