18 March, 2026 | 12:38 PM

ఎన్నికల ఫలితాలపై ‘హిప్పో’ జోస్యం

06-11-2024 12:30 AM

థాయ్‌లాండ్, నవంబర్ 5: ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల్లో గెలుపు ఎవరిదో థాయిలాండ్‌లోని మూ డెండ్ అనే పొట్టి హిప్పో(నీటిగుర్రం) ఆసక్తికర జోస్యం చెప్పింది. థాయ్‌లాండ్‌లోని కావోక్యూ ఓపెన్ జూలో ఉన్న ఈ హిప్పోకు రెండు పుచ్చకాయ కేకులను ఆఫర్ చేశారు.

వీటిలో ఒకదానిపై థాయ్ భాషలో ట్రంప్ అని మరొకదానిపై కమల అని పేర్లు రాసిపెట్టారు. పొట్టిహిప్పో ట్రంప్ పుచ్చకాయ కేకును తినేసింది. అంటే ట్రంప్ గెలవనున్నారని జోస్యం చెప్పింది. అదే జూలో ఉన్న మరో పెద్ద హిప్పో మాత్రం కమల పేరు ఉన్న పుచ్చకాయను తిన్నింది. దీంతో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ తప్పేలా లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.