12 May, 2026 | 12:09 PM

Breaking News

అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో విదేశీ ప్రతినిధులు   •   రెండోసారి అస్సాం సీఎంగా హిమంత బిస్వా శర్మ ప్రమాణస్వీకారం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. అన్నదాత కు అవగాహన   •   మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •  

మిడ్ డే మీల్స్ విధుల నుంచి హెచ్‌ఎంలను మినహాయించాలి

27-11-2024 01:42 AM

డీఎస్‌ఈకు తపస్ విజ్ఞప్తి

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ విధుల నుంచి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు మిన హాయింపునివ్వాలని తెలంగాణ ప్రాం త ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్ రావు, నవాత్ సురేశ్ కోరారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇ.వి.నర్సింహారెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు.

ఉపాధ్యాయుల ను బోధనకు మాత్రమే పరిమితం చే యాలని వారు విజ్ఞప్తి చేశారు. మధ్యా హ్న భోజన పథకం ఏజెన్సీలతో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సమన్వయం చేసుకుంటూ మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించాలని అధికారుల ఆదేశాలతో టీచర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు.

ఇప్పటికే సస్పెండ్ అయిన హెచ్‌ఎం, టీచర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఎటూ సరిపోవడం లేదని, కూరగాయలు, గుడ్డు ధరలు పెరిగాయని తెలిపారు.