17 April, 2026 | 8:29 PM

Breaking News

సోనాల బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు   •   ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •  

శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో హోలీ సంబరాలు

02-03-2026 08:52 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో మాతృభారతి ఆధ్వర్యంలో ముందస్తుగా హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోలీ పండుగ విశిష్టత, పండుగ జరుపుకునే కారణాలను కొంతమంది విద్యార్థులు వివరించారు.

పాఠశాల ఆచార్యులు శ్రీరామ్ సత్యనారాయణ హోలీ పండుగ వెనుక ఉన్న కథను, దాని ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం ఆచార్యులు, విద్యార్థులు, కమిటీ సభ్యులు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాతృభారతి సభ్యులు చిప్ప రమాదేవి, కల్లూరి వైష్ణవి, పల్లెర్ల అఖిల, కట్కూరి స్వాతి, ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.