15 March, 2026 | 10:52 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

నభా నడక ఎలా సాగనుందో

15-07-2024 02:11 AM

తెలుగులో తొలి చిత్రమైన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతోనే తెలుగు వారి మనసు దోచుకుంది నభా నటేష్. తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’, సోలో బ్రతుకే సో బెటర్ తదితర సినిమాలతో యువ హీరోలతో ఆడిపాడి వరుసగా అవకాశాలు దక్కించుకుంది. అలాంటి సమయంలో జరిగిన ప్రమాదం వల్ల రెండేళ్ళు సినిమాలకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే పూర్తిగా కోలుకున్నాక సినిమాల మీద దృష్టి సారించిన నభా, అందుకు తగ్గట్టుగా రెడీ అయ్యానం టోంది. ఆ ప్రయత్నాల్లోనే ‘డార్లింగ్’ సినిమాతో ఈ నెల 19న తెరమీదికి రానుంది. ఆమె ప్రయత్నం అభినందిం చదగ్గదే అయినా.. రెండేళ్ళు సినిమాకి దూరంగా ఉండటం, గతంలో నటించిన హీరోల వంటి వారితో కాక, ప్రియద ర్శితో సినిమా చేయడం వంటివి నభా ప్రయాణాన్ని ప్రశ్నించేలా ఉన్నాయి. ఇటీ వల ‘భారతీయుడు 2’ సినిమాతో వచ్చిన రకుల్ కూడా రెండేళ్ళ తర్వాత తెలుగు తెరపై కనపడింది. శంకర్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో సినిమా చేసినా ఫలితం లేకపోయింది. పదేళ్ళపాటు కెరీర్ సాగించిన ఆమెకే తెలుగులో ప్రస్తుతం మరో సినిమా లేదు. అలాంటిది ఇంకా ఆరంభ దశలోనే ఉన్న నభా నడక ‘డార్లింగ్’ సినిమా తర్వాత ఎలా సాగనుందన్నది ఆసక్తికరంగా మారిందిప్పుడు.