రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి
02-09-2026 | 10:28am
నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో డీసీహెచ్ శివదయాల్ సమీక్ష
నర్సాపూర్: రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డీసీహెచ్ శివదయాల్ సూచించారు. నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిని(Narsapur Area Hospital) సందర్శించిన వారు మాతా శిశు వైద్యం, జనరల్ మెడిసిన్, సర్జరీ, అంటువ్యాధులు, వ్యాధుల సేవలను సమీక్షించారు. ఆసుపత్రిలో ఆహార నాణ్యత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సిబ్బంది విధుల్లో గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశించారు.






