27 February, 2026 | 1:50 AM

మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం

27-02-2026 12:00 AM

కుమురాడి కొండల్లో గుర్తింపు

చర్ల, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో గురువారం భద్రతా బలగాలు మావోయిస్టులకు చెందిన భారీ డంపును గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి. కుమురాడి కొండల్లో మావోయిస్టుల స్థావరం నుంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఐటీబీపీ (ఇండో టి బోర్డర్ పోలీస్) 53 బెటాలియన్, సీఓబీ మండోరా బలగాలు ఏరియా డామినేషన్స్‌లో భాగంగా పెట్రోలింగ్ నిర్వహించారు. దంతేవాడ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రత బలగాలు భగ్నం చేశాయి. బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడ్మా, తులార్ గుహ గ్రామాల సమీపంలోని కొండల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన రెండు 5 కిలోల బరువు ఉన్న రెండు ఐఈడీ లను గుర్తించి, పేల్చి వేసింది.