28 March, 2026 | 5:59 PM

Breaking News

తిరుమలగిరి జడ్‌పిహెచ్‌ఎస్‌లో ఎస్సెస్సీ పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన ఎంఆర్వో   •   జాతీయస్థాయిలో జిల్లా కలెక్టర్ నిర్మల్ దక్కిన గౌరవం   •   ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్   •   వికలాంగులకు 6 వేల పెన్షన్ హామీ ఏమైంది....?   •   మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •  

అలా అన్నందుకు చాలా బాధపడ్డా..

20-10-2024 12:12 AM

సాయి పల్లవి అంతటి బ్యూటీ క్వీన్ వచ్చేసి అన్నయ్య అని పిలిస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది? అదే ఫీలింగ్ తమిళ ప్రముఖ నటుడు శివకార్తికేయన్‌కు కలిగిందట. చాలా బాధపడ్డారట. ఈ విషయాన్ని స్వయంగా తమిళ మూవీ ‘అమరన్ ’ ఆడి యో లాంచ్ ఈవెంట్‌లో వెల్లడించారు. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ్‌లో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్‌లో ఆసక్తికర విషయాలను శివకార్తికేయన్ వెల్లడించారు. ఆయన కెరీర్ బుల్లితెరపై యాంకర్‌గా ప్రారంభమైంది. ఆ తరువాత తన టాలెంట్‌తో వెండితెరపై స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. యాంకర్‌గా చేస్తున్న సమయంలో తొలిసారిగా సాయిపల్లవిని శివకార్తికేయన్ కలిశారట. అప్పటి విషయాలను ఆయన ఈవెంట్‌లో పంచుకున్నారు. “నేను హోస్ట్ చేసిన కార్యక్రమా నికి సాయిపల్లవి వచ్చింది. ఆ తర్వాత ప్రేమమ్ విడుదలైంది. ఆ చిత్రంలో సాయి పల్లవి నటన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదే విషయా న్ని సాయిపల్లవికి ఫోన్ చేసి చెప్పాను. ‘థాంక్యూ అన్న’ అని చెప్పింది. అన్నా అని పిలవడంతో నేను చాలా బాధపడ్డాను” అని శివకార్తికేయన్ వెల్లడించారు.