5 May, 2026 | 2:02 AM

దమ్ముంటే కొనుగోలు కేంద్రాల్లో రైతు ఉత్సవాలు జరపండి

05-05-2026 12:00 AM
  1. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్
  2. రైతు డిక్లరేషన్ ప్రకటించి మూడేళ్లు..
  3. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఒరిగిందేమీ లేదు 

వరంగల్ (మహబూబాబాద్) మే 4 (విజయక్రాంతి):  వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించి మూడేళ్లు గడిచిన ఏ ఒక్క పథకం సక్రమంగా అమలు చేయలేదని, దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో ఉత్సవాలు నిర్వహించాలని, ఇంకెంతకాలం 420 హామీలతో కాలం వెళ్లదీస్తారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోమవారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్,పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, ఇతర నాయకులతో కలిసి వరంగల్ ఎనుమాముల మార్కెట్ ను సందర్శించారు.

ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏ రైతును మందలిచ్చిన ఆవేదనతో ఉన్నారన్నారు. గన్నీ బ్యాగుల కొరత, లారీలు అందుబాటులో లేక, కాంటాలు పూర్తి కాక, మార్కెట్లో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.ఏ పని చేయాలన్నా డబ్బులు వసూలు చేస్తున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. సమస్యలు ఉన్నచోట మార్కెట్లలో రైతు మేళాలు నిర్వహిస్తే కాంగ్రెస్ నేతలకు రైతులే బుద్ధి చెప్తారన్నారు.

ఈనెల 6వ తేదీకి రాహుల్ గాంధీ వరంగల్ లో రైతు డిక్లరేషన్ సభ నిర్వహించి మూడేళ్లు పూర్తవుతుందని, 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చారని, రైతులకు సైతం అనేక హామీలు ఇచ్చారన్నారు. రైతు డిక్లరేషన్ వరంగల్ లోనే చేశారు,.మూడేళ్లలో ఒక్క పథకం అయినా అమలు చేశారా అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ కాలేదని, రుమాఫీ రూ. 38 వేల కోట్లు అని చెప్పి 18 వేల కోట్లు మాత్రమే చేశారన్నారు. రైతు బంధు ఎగ్గొట్టారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా మక్కలను సక్రమంగా కొనడం లేదని, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో మూడు నెలల ముందే పంట కొ నుగోళ్లపై సమీక్షలు చేసేవాళ్ళమన్నారు. యూరియా కోసం, నీళ్ల కోసం రైతులు గోసపడ్డారు,

ఇప్పుడు పంట అమ్మలన్నా ఇబ్బం ది పడుతున్నారన్నారు. గతంలో పంట నష్టపోతే రూ. 10 వేల నష్ట పరిహారం ఇచ్చా మని, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. ప్రతి ఎమ్మెల్యే, మంత్రి రైతుల సమ స్యలు వినాలని, ఈ నెల 6 తారీకు లోపు పంట కొనకపోతే రైతులు మీ క్యాంపు కార్యాలయాలు ముట్టడిస్తారన్నారు.మా సమస్యల ను ప్రభుత్వం  దృష్టికి తీసుకెళ్ళమని రైతులు బీఆర్‌ఎస్ నేతలను కోరుతున్నారన్నారు. రైతులు కష్టపడుతుంటే రైతు ఉత్సవాలు చేసుకుంటారా, మీ డైవర్షన్ పాలిటిక్స్ అందరికీ తెలుసని, మీకు దమ్ముంటే రైతుల కళ్ళాల వద్ధ రైతు ఉత్సవాలు చేయండని ఎర్రబెల్లి సవాల్ విసిరారు.