మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి
- కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి
- త్వరలో వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ సేవలు ప్రారంభం
హనుమకొండ, మే 4 (విజయ క్రాంతి): రేవంత్ రెడ్డి సీఎంకు తక్కువ లిల్లీపుట్ కు ఎక్కువ అని, మోడీ మూడోసారి సీఎం అయ్యాక మొదటిసారి తెలంగాణకు వస్తున్నారని, బహిరంగ సభను విజయవంతం చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపు నిచ్చారు. హనుమకొండ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 10న హైదరాబాద్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని జాహిరాబాద్ లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ, నేషనల్ హైవే, జోగులాంబ రైల్వే స్టేషన్స్, పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్ పార్క్,పెద్దపల్లి, విజయవాడ నుంచి కాజీపేట వరకు మూడో లైన్ రైలుమార్గం 1200కోట్లు తో వర్చువల్ గా ప్రారంభిస్తారని,
ఈ భారీ బహిరంగ సభ కు వచ్చి కెసిఆర్, రేవంత్ రెడ్డి కూడా చూడాలనీ హితవుపలికారు. కనీసం 4లక్షల మంది అక్కడికి వస్తారని, వరంగల్ నుంచి ఎక్కువ సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. కోచ్ ఫ్యాక్టరీ పూర్తి కావడానికి సిద్ధంగా ఉందని, భూమి ఇస్తే ఎయిర్పోర్టును కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని,జాగా ఇచ్చేందుకు దశబ్దం కాలం వృధా చేశారని, రీ ఆర్గనైషన్ బిల్లు ప్రకారం కేంద్రం అభివృద్ధి పనులు చేస్తుందన్నారు. తమిళనాడు లో కూడా ఎన్ డీ ఏ లేకుండా ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేదన్నారు.
పశ్చిమ బెంగాల్ లో ఘన విజయం సాధించామని, కెసిఆర్ 72 ఏండ్లు ఉన్నారు, 100ఏండ్లు బతకాలి ఆరోగ్యంగా ఉండాలనీ,బీ ఆర్ ఎస్ పతనాన్ని కళ్ళారా.. చూడాలన్నారు. మోడీ నాయకత్వంలో బీజేపీ బెంగాల్ లో గెలవడం, తమిళనాడు లో పొత్తుతో మొదలవుతుందనీ, ఈ గెలుపుతో తెలంగాణాలో ప్రతిపక్షాలకు వణుకు పుడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, సుధాకర్, కీర్తి రెడ్డి రవీందర్ యాదవ్, డాక్టర్ కాళీ ప్రసాద్ రావు, పెసర విజయ్ చందర్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, కార్పొరేటర్లు చాడ స్వాతి రెడ్డి, అభినవ్ భాస్కర్, రావుల కోమల కిషన్, కూతురు రాజు, దేవునూర్ మేఘనాథ్ తదితరులు పాల్గొన్నారు.






