18 May, 2026 | 7:04 PM

ప్రతిరోజు వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు

18-05-2026 06:00 PM

సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావ్ 

సుల్తానాబాద్,మే 18 (విజయక్రాంతి): ప్రతిరోజు వాకింగ్, యోగాసనాలు చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని సుల్తానాబాద్ సిఐ రంజిత్ రావు, ఎస్సై చంద్రకుమార్ లు అన్నారు , సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వన్ కే రన్ నిర్వహించారు, ఈ సందర్భంగా జరిగిన సమావేశం లో వారు మాట్లాడుతూ ప్రతిరోజు మనకు ఉన్న 24 గంటల్లో ఒక గంట తప్పకుండా సమయం కేటాయించుకొని వాకింగ్ చేయడం, యోగాసనాలు వేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.

అలాగే మనం తినే భోజనం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలని తద్వారా ప్రతి ఒక్కరూ అనారోగ్యానికి గురి కాకుండా, ఆరోగ్యంగా ఉంటారని అన్నారు, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ప్రోటీన్ గల ఫుడ్ ను తీసుకోవాలన్నారు, ఈ కార్యక్రమం లో మాజీ జెడ్పిటిసి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, డాక్టర్ అయిల రమేష్ , మునిసిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రవీందర్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, సీనియర్ క్రీడాకారులు అమిరీశెట్టి తిరుపతి, కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న ), బైరగోని రవీందర్ , చొప్పరి సుమన్ ,  కౌన్సిలర్లు , వ్యాయామ ఉపాధ్యాయులు, పెద్ద ఎత్తున వాకర్స్ పాల్గొన్నారు...