30 June, 2026 | 11:29 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మహాకుంభమేళాలో ఐఐటీ బాబా సందడి

17-01-2025 02:07 AM

లక్నో, జనవరి 16: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో ‘ఐఐటీ బాబా’ పర్యటన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. హర్యానాకు చెందిన అభేయ్‌సింగ్ ‘ఐఐటీ ముంబై’లో ఏరోస్పేస్ ఇంజినీ రింగ్ పూర్తి చేశారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనే కార్పొరేట్ ఉద్యోగం సాధించాడు. కొంతకాలం తర్వాత ఆధ్యాత్మికం వైపు ఆకర్షితులయ్యారు.

క్రమంగా ‘ఐఐటీ బాబా’గా ప్రసిద్ధి చెందారు. తాజాగా ఆయన ప్రయాగ్‌రాజ్‌కు విచ్చేశారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించి మీడియాతో మాట్లాడారు. తాను సైన్స్ ద్వారా ఆధ్యాత్మికతను ఆస్వాదిస్తున్నానని వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. 

ప్రత్యేక ఆకర్షణగా హర్షా రిచారియా..

మహాకుంభమేళాలో ఉత్తరాఖండ్‌కు చెం దిన హర్షా రిచారియా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. సంప్రదాయ వస్త్రధారణ, నుదుట తిలకం, మెడలో రుద్రక్షమాలతో త్రి వేణి సంగమానికి విచ్చేయగా, ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కొందరు ఆమెను మహి ళా సాధ్వి అంటుండగా, ఆమె మాత్రం తాను సాధ్వి కాదని, కేవలం భక్తురాలిని మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. తాను నిరంజనీ అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ స్వామీజీ శిష్యురాలినని వెల్లడించారు.