మేడిపల్లి మండలంలో అల్పాహార పథకం అమలు
07-08-2026 10:04 PM
ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి
మేడిపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అల్పాహార పథకం మేడిపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విజయవంతంగా అమలు చేయబడుతోందని ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా విద్యార్థులందరికీ ప్రతిరోజూ ఉదయం ఉచితంగా పౌష్టికాహారంతో కూడిన అల్పాహారాన్ని అందిస్తున్నారు. పేద విద్యార్థులకు ఉదయాన్నే బలమైన ఆహారాన్ని అందించడం,హాజరు శాతాన్ని పెంచడం,బడికి వచ్చే పిల్లల సంఖ్యను, వారి ఏకాగ్రతను మెరుగుపరచడం,ఉదయం ఖాళీ కడుపుతో పాఠశాలలకు వచ్చే పిల్లలకు మేలు జరుగుతుందని, విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని కోరారు.






