2 September, 2026 | 5:26 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో..

14-11-2024 | 01:13am

భుజంగరావు మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13 (విజయక్రాంతి): ఫోన్ ట్యా పింగ్ కేసు నిందితుల్లో ఒకరైన మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టేసింది. అనారోగ్య కారణాలతో భుజంగరావుకు కోర్టు గతంలో మధ్యంతర బెయిల్ మంజూ రు చేయగా గురువారం నాటికి బెయి ల్ గడువు ముగిసింది.

దాన్ని పొడగించాలని ఆయన తరపు న్యా యవాది పిటిషన్ వేయగా, దానిపై ఈ నెల 8న వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు ను బుధవారానికి రిజర్వ్ చేసింది. తాజాగా భుజంగరావు మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ గురువారం సాయంత్రం 4 గంటల్లోగా కోర్టులో హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.