15 July, 2026 | 5:32 AM

ఈ వారం వార్తల్లో..

03-11-2024 01:17 AM

జమిలీకి రెడీ

గత ప్రభుత్వాలు దేశాన్ని విభజించేందుకు ప్రయత్నించాయి. కానీ మేం దేశ ఐక్యత, సౌభ్రాతృత్వం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. ఒకే దేశం స్ఫూర్తిగా దేశంలో ఒకే ఎన్నికలు, వన్ రేషన్, వన్ సివిల్ కోడ్ వంటి విధానాలను తీసుకొస్తున్నాం. జమిలీ నిర్వహణకు కేంద్రం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. త్వరలోనే అమలు చేస్తాం. ప్రజలారా సిద్ధమవ్వండి. చెప్పింది చేయరు కదా!

దేశంలో జమిలీ ఎన్నికలు 

ఎప్పటికీ సాధ్యం కావు. ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పుడు జమిలీతో  ఇబ్బందులు తప్పవు. ఒకే దేశం నిర్వహణకు పార్లమెంట్‌లో ఏకాభిప్రాయం అవసరం. దీనిపై ఎన్డీయే దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇది సరికాదు. అయినా ఇందులో ఎవరూ బాధపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రధాని మోదీ చెప్పింది ఎప్పుడూ చేయరు.