4 July, 2026 | 3:28 AM

అమ్దాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

04-07-2026 02:34 AM

లబ్ధిదారులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య భరోసా

మొయినాబాద్, జులై 3(విజయక్రాంతి): మొయినాబాద్ మండలంలోని అమ్దాపూర్ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇళ్లు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గుడిసెలు, అద్దె ఇళ్లలో ఉండే పేదలకు ఈ పథకం ద్వారా శాశ్వత గృహాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

సర్వే నెం. 289లో దాదాపు 30 ఏళ్లుగా నివసిస్తున్న 200 కుటుంబాల ఇళ్లకు నంబర్లు కేటాయించాలని గ్రామ సర్పంచ్ మద్యపాగ కృష్ణ, పాలకవర్గం ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు.దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, వెంటనే ఆ ఇళ్లకు నంబర్లు కేటాయించి, గ్రామ పంచాయతీకి పన్నుల ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని మండల అభివృద్ధి అధికారి  హిమబిందును ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.