calender_icon.png 19 July, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెంచిన ధరలు తగ్గించాలి

11-04-2025 12:11:19 AM

  1. పేదలపై భారం పడకుండా కడుపునిండా తినేలా చూడాలి 

సీపీఎం ఆధ్వర్యంలో నిరసన 

మహబూబ్ నగర్ ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : వంట గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని కనీసం పేదలు కడుపునిండా తినకుండా ఉండేలా ధరలు పెంచడం ఎంతవరకు సమంజసం అని సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. సిలిండర్లను పక్కనపెట్టి కట్టెలపై వెలిగించి తమ నిరసన కొనసాగించారు.

వెంటనే కేంద్రం పెంచిన సిలిండర్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీజిల్లా కార్యదర్శి సభ్యుడు కీల్లె గోపాల్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు వి.పద్మ,  పట్టణ కార్యదర్శి బి చంద్రకాంత్, రాజ్ కుమార్, నాయకురాలు సుమిత్ర అంజమ్మ ,నాగలక్ష్మి, సుశీల, ఖమరలి, భరత్ వి. హనుమంతు, శివయ్యలు పాల్గొన్నారు.