8 July, 2026 | 6:44 AM

ఇండెజీన్ ఐపీవో 46 % ప్రీమియంతో లిస్టింగ్

14-05-2024 12:43 AM

13 శాతం లిస్టింగ్ లాభాలు ఆవిరి

న్యూఢిల్లీ, మే 13: బయోఫార్మా కంపెనీ ఇండెజీన్ ఐపీవో సోమవారం ఇష్యూ ధర తో పోలిస్తే బీఎస్‌ఈలో 46 శాతం ప్రీమి యంతో రూ.659 వద్ద లిస్టయ్యింది. ఈ కంపెనీ గతవారంలో జారీచేసిన పబ్లిక్ ఆఫర్ 70 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూ ధరను రూ.490గా నిర్ణయించారు. దీంతో పోలిస్తే భారీ ధర వద్ద లిస్టయినప్పటి కీ, ముగింపువరకూ ఈ లాభాల్ని కాపాడు కోలేకపోయింది. చివరకు లిస్టింగ్ ధర నుంచి 13 శాతం క్షీణించి రూ.570 వద్ద ముగిసింది. కానీ ఈ ధరతో కూడా ఐపీవో ఇన్వెస్టర్లకు 15 శాతంపైగా లాభం వచ్చినట్టే.