4 September, 2026 | 2:09 PM

తప్పిన పెను ప్రమాదం.. 24 గంటల్లో రెండో ఘటన

04-09-2026 | 01:24pm

న్యూఢిల్లీ: నవీ ముంబై(Navi Mumbai) నుంచి శ్రీనగర్‌కువస్తున్న ఫ్లైట్ 6E 225 (VT-NOG) ప్రమాదానికి గురైంది. శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Srinagar International Airport) ల్యాండింగ్ అవుతుండగా ఇండిగో విమానం(IndiGo 6E 225) ఒక స్తంభాన్ని ఢీకొనడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అధికారుల ప్రకారం, విమానాశ్రయంలోని బే నెం. 06లోకి విమానాన్ని తరలిస్తుండగా శుక్రవారం ఉదయం 9:02 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

విమానం విజువల్ డాకింగ్ గైడెన్స్ సిస్టమ్ ( Visual Docking Guidance System) స్తంభాన్ని ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ గాయాలు కాలేదని విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. విమానంలోని మాన్యువల్ మెట్ల(Manual staircase) ద్వారా ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటనకు కారణమేమిటో తెలుసుకోవడానికి సమగ్ర విచారణకు ఆదేశించారు.