8 July, 2026 | 7:58 AM

డీఎల్‌ఎఫ్ లాభం 61 శాతం వృద్ధి

14-05-2024 12:42 AM

న్యూఢిల్లీ, మే 13: రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్ నికరలాభం 2024 మార్చి తో ముగిసిన క్యూ4లో 33 శాతం వృద్ధిచెంది రూ. 921 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ లాభం రూ. 570 కోట్లుగా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికరలాభం 33 శాతం వృద్ధితో రూ. 2,733 కోట్లకు చేరింది. క్యూ4లో ఆదాయం 47 శాతం పెరిగి రూ.1,456 కోట్ల నుంచి రూ.2,153 కోట్లకు పెరిగింది.