31 May, 2026 | 8:08 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

4 గోల్ పోలో చాంపియన్‌గా భారత్

16-02-2026 12:00 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 15: హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ అరెనా పోలో చాంపియన్‌షిప్‌లో 4 గోల్ టోర్నీని భారత్ కైవసం చేసుకుంది. ఫైవల్లో భారత్ 21 స్కోర్ తేడాతో ఫ్రాన్స్‌పై విజయం సాధించింది. ఆరంభంలో వెనుకబడిన భారత్ తర్వాత అద్భుతంగా పుంజుకుని ఫ్రాన్స్‌కు చెక్ పెట్టింది. కెప్టెన్ యూసఫ్ అజ్మి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అజ్మి ఏకంగా 9 గోల్స్ కొట్టాడు.

అలాగే భారత్ తరపున చైతన్య కుమార్ 5 గోల్స్ , మహ్మద్ నయీముద్దీన్ 6 , కున్వర్ విశాల్ సింగ్ 1 గోల్ సాధించారు. చాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు మంత్రి అజారుద్దీన్ ట్రోఫీ అందజేశారు. ఇలాంటి అంతర్జాతీయ పోలో ఈవెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వడం సంతోషంగా ఉందని అజారుద్దీన్ చెప్పారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రమాణాలతో పోలో గ్రౌండ్ తయారు చేసిన హెచ్‌పీఆర్‌సీ నిర్వాహకులను ప్రశంసించారు.