16 March, 2026 | 3:08 PM

Breaking News

యుద్ధాన్ని ఆపాలని సీపీఐ రాస్తారోకో   •   అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •  

డెఫ్ షూటింగ్‌లో భారత్ అదరహో

10-09-2024 03:19 AM

హనోవర్ (జర్మనీ): ప్రపంచ డెఫ్ (బదిరుల) షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ సత్తా చాటింది. మొత్తం 21 పతకాలతో పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచి అదరహో అనిపించింది. ఇందులో ఏడు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్యాలు గెలుచుకోవడం విశేషం. ఇక పోటీల్లో భాగంగా చివరి రోజు మహిళల 50 మీటర్ల రైఫిల్ పొజిషన్ ఈవెంట్‌లో షూటర్ మహిత్ సంధు స్వర్ణం కొల్లగొట్టగా.. పురుషుల 25 మీ పిస్టల్ విభాగంలో అభినవ్ పసిడి.. చేతన్ హన్మంత్ సప్కల్ కాంస్యం గెలుచుకున్నాడు. తెలుగు షూటర్ ధనుశ్ శ్రీకాంత్ (10 మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో రెండు స్వర్ణాలతో మెరవడం విశేషం. ఉక్రెయిన్ 18 పతకాలతో (ఏడు స్వర్ణం, ఐదు రజతం, ఆరు కాంస్యాలు) రెండో స్థానంలో, ఆతిథ్య జర్మనీ 4 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది.