17 June, 2026 | 8:57 PM

Breaking News

పీఎం శ్రీ పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ   •   స్థానిక హమాలీల హక్కులకు భంగం.. ఫ్యాక్స్ సొసైటీపై ఆగ్రహం   •   రేపటి నుంచి యూరియా బుకింగ్ ప్రారంభం   •   గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు   •   కామారెడ్డి జిల్లా ఒలంపిక్ డే రన్ 2026 చైర్మన్ గా డా.యం.జైపాల్ రెడ్డి   •   బోర్వెల్ బండి బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు   •   ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •  

జెమీమా హాఫ్ సెంచరీ, భారత్ 198

07-03-2026 12:14 AM

ఆస్ట్రేలియాతో ఏకైక టెస్ట్

ఆసీస్ స్కోరు 96/3

పెర్త్, మార్చి 6: ఆస్ట్రేలియా పర్యటనలో ఏకైక టెస్టు ఆడుతున్న భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్ లో 198 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో భారత జట్టు తరపున నలుగురు ప్లేయర్లు టెస్ట్ అరంగేట్రం చేశారు. యువ క్రికెటర్లు ప్రతీకా రావల్, క్రాంతి గౌడ్, కాశ్వీ గౌతమ్, సయాలి సత్ఘారే టెస్ట్ క్యాప్ లు అందుకున్నారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ కు సరైన ఆరంభం దక్కలేదు.

స్మృతి మంధాన 4 పరుగులకే ఔటవగా.. అరంగేట్రం చేసిన ప్రతీకా రావల్ 18 రన్స్‌కు ఔటైంది. అయితే షెఫాలీ వర్మ(35) , జెమీమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీతో రాణించారు.  జెమీమా రోడ్రిగ్స్ 52 (7 ఫోర్లు) పరుగులకు ఔటైన తర్వాత కశ్వి గౌతమ్ ఆదుకుంది. నిలకడగా ఆడి 34 పరుగులు చేసింది. దీంతో భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌటైంది. 

తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ మహిళల జట్టుకు ఆదిలోనే సయాలీ సద్ఘరే షాకిచ్చింది. ఓపెనర్ జార్జియా వోల్ (2), కెప్టెన్ అలీ హీలీ(13)లను పెవిలియన్ కు పంపింది. తర్వాత లిచ్ ఫీల్డ్‌ను  క్రాంతి గౌడ్ ఔట్ చేయడంతో ఆసీస్ 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఎలీసా పెర్రీ, అన్నాబెల్ సదర్లాండ్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 38 పరుగులు జోడించారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్లకు 96 రన్స్ చేసింది.