17 June, 2026 | 9:56 PM

ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు

17-06-2026 08:41 PM

చివ్వెంల: చివ్వెంల మండల పరిధిలోని వట్టి ఖమ్మంపహాడ్ గ్రామ శివారులో బుధవారం కారు దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా సుబ్బిలేడు గ్రామానికి చెందిన బత్తుల వెంకటనారాయణ డస్టర్ కారులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఇంజన్‌లో సాంకేతిక లోపం ఏర్పడి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన వారు కారును నిలిపివేసి బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. అయితే మంటలు వేగంగా వ్యాపించి కారు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.