17 June, 2026 | 10:05 PM

బోర్వెల్ బండి బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

17-06-2026 08:44 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం రోళ్లపాడు నుంచి బిలియాతండ వైపు వెళ్తున్న బోర్వెల్ బండి మార్గమధ్యలోని ఓ మూలమలుపు వద్ద అదుపుతప్పి పొలాల్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బోర్వెల్ బండి డ్రైవర్ రాజు (35) తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో రాజుకు తొడ ఎముక విరగడంతో పాటు ముఖంపై తీవ్ర గాయాలు కాగా, అధిక రక్తస్రావం జరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే టేకులపల్లి 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఇల్లందు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సహాయక చర్యల్లో ఈఎంటి అశోక్, పైలట్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.