14 June, 2026 | 4:24 PM

Breaking News

అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్: ఎస్ఐ మోతిరామ్   •   పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •  

పేదల కళ్ళల్లో ఆనందమే... ప్రజా ప్రభుత్వం లక్ష్యం

20-02-2026 09:23 PM

తెలంగాణ రాష్ట్రంలోమళ్లీ ఇందిరమ్మ సంక్షేమ పాలన 

జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్

జవహర్ నగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఇందిరమ్మ సంక్షేమ పాలన మొదలైందని పేదల కళ్ళల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఆరు గ్యారంటీ పథకాలతో తెలంగాణ స్వర్ణయుగలంలా మారుతుందని జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి జవహర్ నగర్ మల్లికార్జున యాదవ  సంఘం కాలనీలో నూతనంగా నిర్మాణమైన ఇందిరమ్మ ఇళ్ళను జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ... అర్హులైన పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళలను మంజూరు చేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో జవహర్ నగర్ లో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ళు వచ్చాయని, లబ్ధిదారులు ఇళ్ళు పూర్తయినందుకు సంతోషంగా ఉన్నారని అన్నారు.

తెలంగాణలో అత్యధికంగా కార్పొరేషన్, మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుందంటే ప్రజా పాలనకు ప్రజలు జై కొట్టారని పేర్కొన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుడ్ల వెంకటేశ్వర్లు, సతీష్ గౌడ్, బల్లి శ్రీనివాస్, యాదగిరియాదవ్, వినయ్ కుమార్, అజయ్, సాయికృష్ణ,  పద్మారావు, రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.