calender_icon.png 20 February, 2026 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్మర్ రిజిస్టర్ తోనే రైతుకు అభివృద్ధి పథకాలు

20-02-2026 09:11:39 PM

అన్నారం సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి

తుంగతుర్తి,(విజయక్రాంతి): ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని యూరియా యాప్ పై రైతుకు అవగాహన కలిగి ఉండాలని అన్నారం సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించారు. చాలామంది రైతులకు స్మార్ట్ ఫోన్లు లేవు. కావున రైతు సంబంధిత అధికారుల సహకారంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.

ప్రస్తుతం రైతుకు యూరియా కూడా భారంగా మారిందని, యూరియా ఆ పని కూడా రైతులు ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవాలని కోరారు. అవసరమైతే గ్రామంలోని మేధావుల ద్వారా, ప్రతి రైతుకు తన వంతుగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేస్తానని, అభివృద్ధి పథకాలు రానున్న రోజుల్లో ప్రతి రైతుకు ప్రభుత్వం ద్వారా అందుతాయి అని పేర్కొన్నారు.దీనితో గ్రామంలోని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సాయి సృజన, గ్రామపంచాయతీ అధికారి సంజీవ, తదితరులు పాల్గొన్నారు.