30 April, 2026 | 3:23 AM

బోయిన్‌పల్లి, తిరుమలగిరిలో పెట్రోల్ పంపులు తనిఖీ

30-04-2026 01:52 AM

సికింద్రాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): పెట్రోల్ పంప్ యజమానులు పెట్రోల్, డీజిల్ కొరత సృష్టించి వాహనదారులను  ఇబ్బందులకు గురి చేస్తే కట్టిన చర్యలు తప్పవని బేగంపేట, తిరుమలగిరి ఏసిపిలు పి. గోపాలకృష్ణ మూర్తి,జి రమేష్ తెలియజేశారు.

నగరంలోని కొన్ని ప్రాంతా ల్లో కృత్రిమంగా ఇంధన కొరత సృష్టిస్తున్నారనే సమాచారం నేపథ్యంలో వాహనదా రులు అందరికీ ఇంధన సరఫరా జరుగుతుందో లేదో నిర్ధారించేందుకు తిరుమల గిరి, బోయిన్పల్లి ప్రాంతంలోని బేగంపేట్ ఏసిపి పి.గోపాల కృష్ణ మూర్తి, తిరుమలగిరి ఏసిపి రమేష్, బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ ఎన్.తిరుపతి రాజు, తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, సర్దార్ నాయక్, తిరుమలగిరి ఇన్స్పెక్టర్ జె.నాగరాజ్  వేర్వేరు ప్రాంతాల్లో ఇంధన నింపే కేంద్రాలలో సివిల్ సప్లై అధికారుల సమన్వయంతో పెట్రోలు బంకుల ను తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా పెట్రోల్ బంకులలో స్టాక్ లభ్యతను అధికారులు పరిశీలించడంతో పాటు సరఫరా విధానంపై యాజమాన్యం తో చర్చించారు. తనిఖీల్లో ఎలాంటి అవకతవకల పాల్పడిన,కృత్రిమ కొరత సృష్టించిన లేదా స్టాక్ ఉన్నప్పటికీ సరఫరాను నిలిపివేయడం వంటి మోసాలకు పాల్పడిన సంబంధిత పెట్రోల్ బంకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అధికారులు హెచ్చరించారు.